ఫ్యాన్స్ తో నాని మీట్…శ్యామ్ సింగరాయ్ కు సరికొత్త ప్రమోషన్స్ షురూ!

Published on Nov 22, 2021 3:31 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని నీహారిక నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఈ చిత్రం ను డిసెంబర్ 24 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాక చిత్ర విడుదల తేదీ లో కూడా ఎలాంటి మార్పు లేదని ఇప్పటికే చిత్ర యూనిట్ మీడియా కి తెలిపింది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది.

అయితే ఈ మేరకు హీరో నాని తన అభిమానులను కలిసేందుకు సిద్దం అయ్యారు. నాని ఫ్యాన్స్ మీట్ అంటూ నవంబర్ 28 వ తేదీన హైదరాబాద్ లో ఒక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫ్యాన్స్ ఎవరైతే ఈ కార్యక్రమం లో పాల్గొనాలని అనుకుంటున్నారో వారు కింద నంబర్ లను సంప్రదించాలి అంటూ ఒక పోస్టర్ ను షేర్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :

More