“దసరా”..ముంబై లో నానికి అదిరే వెల్కమ్.!

Published on Mar 8, 2023 11:00 am IST

నాచురల్ స్టార్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “దసరా”. అంతకంతకు మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం నాని నుంచి మొదటి పాన్ ఇండియా సినిమాగా రానుంది. ఆల్రెడీ టీజర్ మరియు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ అన్ని భాషల్లో రాగా ఈ సినిమా హిందీ మార్కెట్ వసూళ్లు కూడా ఆసక్తిగా మారాయి.

అయితే నాని ఈ సినిమా హిందీ ప్రమోషన్స్ నిమిత్తం ముంబై వెళ్లగా అక్కడైతే తనకి సాలిడ్ వెల్కమ్ ఆడియెన్స్ నుంచి దక్కింది. మరి అక్కడ యూత్ తో అయితే నాని ఈ పండుగ సెలెబ్రేషన్స్ లో పాల్గొనగా ఆ వేడుకల్లో తన దసరా సినిమా ప్రమోషన్స్ ని తాను చేసాడు.

దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ వీడియో ని కూడా నాని షేర్ చేయగా ఇది వైరల్ గా మారింది. మొత్తానికి అయితే హిందీ ఆడియెన్స్ నుంచి కూడా దసరా కి మంచి ఓపెనింగ్స్ దక్కే లాగానే అనిపిస్తున్నాయి. మరి వరల్డ్ వైడ్ ధరణి గాడి ర్యాంపేజ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ మార్చ్ 30 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :