వినూత్నంగా ‘హిట్ 3’ ప్రమోషన్స్.!

వినూత్నంగా ‘హిట్ 3’ ప్రమోషన్స్.!

Published on Apr 18, 2025 7:00 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “హిట్ 3” కోసం అందరికీ తెలిసిందే. మరి నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా రీసెంట్ ట్రైలర్ తో మరిన్ని అంచనాలు ఈ చిత్రంపై ఏర్పడ్డాయి. ఇక నాని సినిమాలు అంటే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే.

తన సినిమాల లానే ప్రమోషన్స్ కూడా నాని వినూత్నంగానే ట్రై చేస్తూ ఉంటాడు. ఇపుడు ఇదే వినూత్నత హిట్ 3 ప్రమోషన్స్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హిట్ 3 ఇంటర్వ్యూల తాలూకా సెటప్ వైరల్ గా మారింది. సినిమా థీమ్ కి తగ్గట్టుగా ఆయుధాలు, రక్తం ఇలా డిఫరెంట్ గా మొత్తం సెట్ చేసి ప్లాన్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి మాత్రం హిట్ 3 ప్రమోషన్స్ కూడా హిట్టే అని చెప్పవచ్చు. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ మే 1న రాబోతుండగా సాలిడ్ హైప్ ఈ సినిమా పట్ల నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు