‘టైగర్ నాగేశ్వర్ రావు’ గా నాని మెప్పిస్తాడా !

‘టైగర్ నాగేశ్వర్ రావు’ గా నాని మెప్పిస్తాడా !

Published on Jun 20, 2018 10:32 PM IST


టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ల హావా నడుస్తోంది. ‘మహానటి సావిత్రి’ బయోపిక్ ఘన విజయం సాధించడంతో మేకర్స్ కి కూడా బయోపిక్ ల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ లో నాని నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘టైగర్ నాగేశ్వర్ రావు’ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఐతే 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు. మరి అలాంటి భయానిక గజదొంగ పాత్రలో, నాచ్యురల్ స్టార్ నాని ఎలా కనిపించబోతున్నాడు ? పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని, అంతటి గజదొంగ పాత్రకి సూట్ అవుతాడా ?

మొదట ‘టైగర్ నాగేశ్వర్ రావు’ పాత్రలో ‘రానా’ని అనుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ రానా ఈ చిత్రం నుండి తప్పుకోవడంతో నాని ఫ్రేమ్ లోకి వచ్చాడు. నాని ఈ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ పాత్ర కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోనున్నారట. నాని తన గెటప్ లో గాని, హావభావాలు పలికించడంలో గాని కొత్తగా ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు