నాని ‘జెర్సీ’ ధరించడానికి సిద్దమవుతున్నాడు !

Published on Aug 10, 2018 7:35 pm IST

న్యాచురల్ స్టార్ నాని క్రికెట్ నేపధ్యంలో తెరకెక్కనున్న చిత్రం’జెర్సీ’ లో నటించనున్నాడని తెలిసిందే. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ ‘మళ్ళీ రావా’ చిత్ర డైరెక్టర్ గౌతమ్ డైరెక్ట్ చేయనున్నారు. కథ రీత్యా నాని ఈచిత్రంలో భిన్న వయసు గల పాత్రల్లో నటించనున్నాడు అందుకోసం నాని సన్నాహాలను మొదలుపెట్టాడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

నాని ఈ సినిమాలో అర్జున్ అనే పాత్రలో నటించనున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి మల్టి స్టారర్ చిత్రం ‘దేవదాస్’ చిత్రంలో నటిస్తున్నాడు. దాంతో పాటు గా బుల్లితెర రియాల్టీ షో ‘బిగ్ బాస్ 2’ కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. వీటిని పూర్తి చేసిన తరువాత ఈ సెప్టెంబర్ రెండవ వారంలో ఈ జెర్సీ చిత్ర షూటింగ్ నుండి మొదలు పెట్టనున్నారు నాని.

సంబంధిత సమాచారం :

More