నాని జెర్సీ కూడా అప్పుడే ప్రారంభం కానుంది !

నాని జెర్సీ కూడా అప్పుడే ప్రారంభం కానుంది !

Published on Sep 17, 2018 3:23 PM IST

Jerssy

నాని క్రికెట్ ఆడడానికి రెడీ అవుతున్నాడు. ‘మళ్ళీ రావా’ చిత్ర దర్శకుడు గౌతమ్ దర్శకత్వంలో నాని తన 23వ చిత్రం ‘జెర్సీ’లో నటించనున్నాడని తెలిసిందే. ఈచిత్రం క్రికెట్ నేపథ్యంలో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈసినిమా షూటింగ్ అక్టోబర్లో దసరాకు ప్రారంభం కానుందట.

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈచిత్రానికి తమిళ యువ సంగీత సంచలనం అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈచిత్రంలో హీరోయిన్ గా నిత్య మీనన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.

నాని ఈచిత్రంలో మూడు వైవిధ్యమైన పాత్రల్లో నటించనున్నాడని సమాచారం. అందులో ఒకటి అర్జున్ పాత్ర కాగా మరో రెండు పాత్రల గురించి తెలియాల్సి వుంది. ఇక ఆయన నటించిన ‘దేవదాస్’ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలకానుంది. ఈచిత్రంలో నాని అగ్ర హీరో నాగార్జునతో కలిసి నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు