నాని -సుధీర్ బాబు ల మల్టీ స్టారర్ లాంచ్ కు డేట్ ఫిక్స్ !

Published on Apr 24, 2019 1:13 pm IST

నాని , సుధీర్ బాబు లతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కించనున్నాడని తెలిసిందే. ఈ చిత్రం ఈ నెల 26న లాంచ్ కానుందని సమాచారం. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మించనున్న ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి,నివేత థామస్ కథానాయికలుగా నటించనుండగా బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు.

ఇక నాని కి మోహన్ కృష్ణ తో ఇది మూడవ సినిమా కాగా సమ్మోహనం తరువాత సుధీర్ బాబు , అదితి కి ఇది రెండవ సినిమా. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది. ఇక జెర్సీ సినిమా విజయం తో ఫుల్ జోష్ లో వున్న నాని ప్రస్తుతం విక్రమ్ కుమార్ తో గ్యాంగ్ లీడర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :