మొదటి షెడ్యూల్ ముగించుకున్న నాని, నాగార్జునల చిత్రం !

28th, March 2018 - 08:40:29 AM

సీనియర్ స్టార్ హీరో నాగార్జున, నానిలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం యొక్క షూటింగ్ ఉగాది రోజున మొదలైన సంగతి తెలిసిందే. ఖచ్చితమైన ప్లానింగ్ తో చిత్రీకరణ మొదలుపెట్టిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చాలా త్వరగా మొదటి షెడ్యూల్ ముగించేశారు.

ఈ మొదటి షెడ్యూల్లో హైదరాబాద్లోని మియాపూర్ మెట్రో స్టేషన్లో నాని, రష్మిక మందన్న, సంపూర్ణేష్ బాబుల మీద కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.