తమిళంలోకి వెళ్తున్న మరో తెలుగు సినిమా !

ninukoriw

తెలుగులో వచ్చి మంచి విజయాలు సాధించిన అత్తారింటికి దారేది, అర్జున్‌ రెడ్డి లాంటి సినిమాలు ఈ మధ్య వరుసగా ఇతర భాషల్లోకి రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ కూడా ఆది పినిశెట్టి హీరోగా తమిళంలోకి రీమేక్ కానుంది. కాగా మరో సినిమా ‘నిన్ను కోరి’ కూడా తమిళంలోకి వెళ్లనుంది. దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు హీరో వైభవ్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

కాగా ‘గొడవ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన వైభవ్‌ ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్నారు. 2017లో శివా నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్ను కోరి’ చిత్రం మంచి విజయం సాధించింది. తెలుగులో నాని పోషించిన క్యారెక్టర్‌ను తమిళంలో వైభవ్‌ చేస్తున్నారు. అయితే ఇంకా తమిళంలో తెరకెక్కించే దర్శకుడిని ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ చిత్రాన్ని కాస్మో కిరణ్‌ తమిళంలోకి నిర్మించనున్నారు.

Exit mobile version