ఈసారి ఓటీటీకి నాని ఓటు పడదు

ఈసారి ఓటీటీకి నాని ఓటు పడదు

Published on Apr 23, 2021 3:00 AM IST

గత లాక్ డౌన్ సమయంలో తెలుగు సినిమా హీరోలు చాలామంది ఓటీటీ వైపుకు వెళ్దామా వద్దా అనే డైలమాలో ఉండగా నాని మాత్రం ‘వి’ చిత్రాన్ని ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లారు. అయితే ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. ఇకపోతే ఈసారి కూడ సినిమా థియేటర్ల మీద ఆంక్షలు పడుతున్నాయి. ఎప్పుడు 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు వస్తాయో తెలియట్లేదు. దీంతో పూర్తికాబడి విడుదలకు రెడీగా ఉన్న సినిమాలు వాయిదాపడ్డాయి.

దీంతో ఆయా సినిమాల నిర్మాతలు ఓటీటీ వైపు దృష్టి సారిస్తున్నారు. కొన్ని చిన్న సినిమాలు ఆల్రెడీ ఓటీటీ వైపుకు అడుగులు వేస్తున్నాయి. నాని కొత్త చిత్రం ‘టక్ జగదీష్’ను కూడ ఓటీటీకి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చిందట. అయితే నాని మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారట. సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని, ఆలస్యమైనా సరే 100 శాతం ఆక్యుపెన్సీ కుదిరే వరకు ఎదురుచూద్దామని క్లారిటీగా చెప్పేశారట. దీన్నిబట్టి సినిమా థియేట్రికల్ సక్సెస్ మీద నానికి ఎంత నమ్మకమో అర్థమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు