చెప్పా పెట్టకుండా సర్ప్రైజ్ ఇచ్చిన నాని

Published on Jun 15, 2021 3:01 am IST

హీరో నాని సొంతగా నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ స్థాపించి సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘అ !, హిట్’ లాంటి చిత్రాలను నిర్మించి తన అభిరుచిని చాటుకున్న నాని ఇప్పుడు కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండానే ఈరోజు ఆ చిత్రాన్ని లాంఛ్ చేసేశారు. చిత్రానికి ‘మీట్ క్యూట్’ అనే అందమైన టైటిల్ నిర్ణయించారు. ఈ చిత్రాన్ని దీప్తి గంట డైరెక్ట్ చేస్తున్నారు. దీప్తి గంట స్వయంగా నానికి సోదరి. సోదరిని దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు ఆయన.

దీప్తి గంట గతంలో ‘అనగనగా ఒక నాన్న’ అనే షార్ట్ ఫిల్మ్ చేశారు. ఆమెకు ఇదే మొదటి ఫీచర్ ఫిల్మ్. ఈ సినిమాకు కథ కూడ ఆమె రాసుకున్నారు. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైందని అంటున్నారు నాని. ఈరోజు ప్రధాన తారాగణం మీద షూటింగ్ మొదలుపెట్టారు. నాని క్లాప్ కొట్టి చిత్రీకరణను స్టార్ట్ చేశారు. షాట్లో సీనియర్ నటుడు సత్యరాజ్ సహా టైటిల్ రోల్ చేస్తున్న నటి కూడ ఉంది. అయితే ఆమె ఎవరనేది రివీల్ కాకుండా జాగ్రత్తపడ్డారు టీమ్. చూడబోతే సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉండేట్టు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :