నాని ప్రొడ్యూసర్స్ ఇప్పుడు అఫిషియల్ గా వచ్చేశారు!

Published on Oct 9, 2021 12:50 am IST


శివ నిర్వాణ దర్శకత్వం లో నాని హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన టక్ జగదీష్ చిత్రం ను షైన్ స్క్రీన్స్ పతాకం పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రం ప్రొడ్యూసర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కి అఫిషియల్ గా వచ్చేశారు. అంతేకాక తాము భవిష్యత్ లో చేయబోయే సినిమాల కోసం ఇక్కడ చూడవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. షైన్ స్క్రీన్స్ పతాకం పై ఇప్పటి వరకు కృష్ణార్జున యుద్ధం, మజిలీ, టక్ జగదీష్, గాలి సంపత్ లు నిర్మించబడ్డాయి. అయితే కొందరు అభిమానులు మాత్రం, టక్ జగదీష్ సమయం లో ఇలా ఎందుకు చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది లు ఈ బ్యానర్ పై సినిమాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :