తన ఫై వస్తున్న కామెంట్లకు స్పందించిన నాని !

Published on Sep 4, 2018 9:34 pm IST

బిగ్ బాస్ సెకండ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్ననాని ఫై రోజు రోజుకి విమర్శలు ఎక్కువతున్నాయి. అంతా స్రిప్ట్ ప్రకారం ఎలిమినేషన్ జరుగుతుందని దాని కోసం మమల్ని ఓట్లు అడగడం దేనికని సోషల్ మీడియా లో పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇక మరికొందరు అయితే నాని కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాడు దాంతో మాకు షో మీద మరియు ఆయన మీద గౌరవం పోతుందని కామెంట్ చేశారు. తాజాగా ఈ పోస్ట్ లను చూసిన నాని వాటిఫై స్పందిచాడు.

నన్ను క్షమించండి. మీలో కొంత మంది బాధ పడుతున్నారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయి. మీ అభిమాన కంటిస్టెంట్ను మీరు బాగా సపోర్ట్ చేస్తారు. కాని హోస్ట్ హోదాలో ఉండి నేను ఆలా చేయలేను షోలో నేను కొంతమందికి వత్తాసు పలుకుతున్నాని మీరు అనుకుంటున్నారు అది నిజం కాదు నేను అందరిని సమానంగా నిజం చూస్తాను. ఈవిషయంలో నాకు మద్దుతుగా నిలవండి. మీ నమ్మకాన్ని నిలబెడుతాను. మీ మద్దతుతోనే ఒకరు విజేతగా నిలుస్తారు. ఇందులో నా ప్రమేయం ఉండదు. నా బెస్ట్ ఇవ్వడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తా. మీకు నేను నచ్చినా నచ్చకున్నా మీరంతా నా ఫ్యామిలీయే మీరు నన్ను కింద పడేయరు మీ ప్రేమకోసం నా సాయశక్తులా ప్రయత్నిస్తా. మీ నాని అని ఒక లేక ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

సంబంధిత సమాచారం :