ఎప్పటికీ నా ఫేవరెట్ ఆయనే – నాని
Published on Jun 4, 2018 1:04 pm IST

తెలుగునాట మంచి ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ రెండవ సీజన్ అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. గత సీజన్ కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఈసారి సీజన్ ను నాని హోస్ట్ చేయనున్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ బిగ్ బాస్ హౌస్ సెట్లో చిత్రీకరణ జరగనుంది. జూన్ 10 నుండి ఈ షో మొదలుకానున్న సందర్బంగా నిర్వాహకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఇందులో నాని కూడ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విలేకర్లు నానిని మీ ఫేవరెట్ టీవీ హోస్ట్ ఎవరని అడగ్గా ఆయన తెలివిగా అమితాబ్ బచ్చన్ గారి హోస్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని సమాధానమిచ్చారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడ స్థానం కల్పిస్తూ నిర్వహిస్తున్న ఈ షోలో కంటెస్టెంట్స్ ఎవరనే విషయాన్ని జూన్ 10వ తేదీ రాత్రి 9 గంటలకు రివీల్ చేయనున్నారు నిర్వాహకులు.

16 మంది సెలబ్రిటీలు పాల్గొననున్న ఈ షోలో ప్రతి సెలబ్రిటీ కదలికను క్షుణ్ణంగా గమనించేందుకు ఏకంగా 70 కెమెరాలను వాడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook