“శ్యామ్ సింగ్ రాయ్” లాంచ్ అయ్యేది రేపే.!

“శ్యామ్ సింగ్ రాయ్” లాంచ్ అయ్యేది రేపే.!

Published on Dec 9, 2020 2:58 PM IST

nani 2

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న “టక్ జగదీష్” చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే ఫైనల్ షూట్ ను స్టార్ట్ చేసుకుంది. అయితే ఇప్పుడు నాని చేపట్టిన పలు ఆసక్తికర ప్రాజెక్టులలో ఒకటైన “శ్యామ్ సింగ్ రాయ్” కూడా స్టార్ట్ అయ్యేందుకు ఇపుడు ముహూర్తం కుదిరింది.

“టాక్సీవాలా” సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించున్న ఈ చిత్రం నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కనుంది. అంతే కాకుండా డిఫరెంట్ షేడ్స్ లో నాని కనిపించనున్న ఈ చిత్రం రేపు డిసెంబర్ 10 న హైదరాబాద్ లో పూజా కార్యక్రమంతో లాంచ్ కానుంది.

మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో నాని సరసన మరోసారి టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి మరియు లేటెస్ట్ “ఉప్పెన” హీరోయిన్ కృతి శెట్టి లు ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు