డీసెంట్ టీఆర్పీ రేటింగ్ అందుకున్న “శ్యామ్ సింగ రాయ్”.!

Published on Apr 14, 2022 2:00 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా మరో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా “శ్యామ్ సింగ రాయ్” కోసం తెలిసిందే. నాని నటించిన ఓ సినిమా చాలా కాలం తర్వాత థియేటర్స్ లో వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే థియేటర్స్ లో మాత్రమే కాకుండా తర్వాత ఓటిటి లో కూడా వచ్చాక మంచి రెస్పాన్స్ ని అందుకుంది.

మరి రీసెంట్ గా జెమినీ టీవీ లో ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కి రాగా ఇప్పుడు దీనికి డీసెంట్ టీఆర్పీ వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాకి గాను ఫస్ట్ టెలికాస్ట్ లో 6.87 టీఆర్పీ రేటింగ్ సాధించింది అట. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించారు. అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :