కళ్ళు చెదిరే ధరకు నాని సినిమా ఈ హక్కులు.?

Published on Apr 23, 2021 5:00 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వాటిలో ఆల్రెడీ తన హిట్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కించిన “టక్ జగదీష్” రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక దీని తర్వాత దీనికి మించిన అంచనాలు సెట్ చేసుకున్న చిత్రం మాత్రం “శ్యామ్ సింగ రాయ్”. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చెదిరే బిజినెస్ ను జరిపినట్టుగా తెలుస్తుంది. థియేట్రికల్ హక్కులు కాకుండా కేవలం డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులకే ఈ చిత్రం 30 కోట్లకు అమ్ముడుపోయిందట టైర్ 2 హీరోస్ లో ఇది మాత్రం పెద్ద మొత్తమే అని చెప్పాలి. అయితే అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంపై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటిస్తుండగా నిహారికా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :