విడుదలకు సిద్ధం అవుతున్న నాని సినిమా.?

Published on Jun 15, 2021 9:59 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో తన హిట్ దర్శకుడు శివ నిర్వాణం దర్శకత్వంలో ప్లాన్ చేసిన రెండో ఇంట్రెస్టింగ్ చిత్రం “టక్ జగదీష్”. క్లాస్ అండ్ మాస్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఏడాది గత ఏప్రిల్ నెలలోనే విడుదలకు సిద్ధం చేసిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ మూలాన వాయిదా పడాల్సి వచ్చింది. ఇక అక్కడ నుంచే ఆన్ టైం రిలీజ్ కావాల్సిన చాలా చిత్రాలు కూడా ఆగిపోయాయి.

మరి ఇప్పుడు ఎట్టకేలకు నాని సినిమా విడుదలకు సిద్ధం అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే జూలై నెలాఖరున విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ అక్కడ కుదరకపోతే ఆగష్టు మూడో వారంలో అలా విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సాలిడ్ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. అలాగే షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :