తనదైన సినిమాలు అలాగే తన సహజ నటనతో మంచి ఆదరణను సంపాదించుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఇప్పుడు కూడా తన కొత్త తరహా సినిమాలను పరంపరను కొనసాగిస్తూ ప్లాన్ చేసిన సినిమాల్లో ఒకటైన “టక్ జగదీశ్” కూడా ఒకటి. టాలెంటెడ్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
మరి అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా సినిమాను తీర్చిదిద్దారు. ఇక ఇదిలా ఉండగా మేకర్స్ ఈరోజు తమ చిత్రం నుంచి ఒక అప్డేట్ ఇస్తున్నామని నిన్న అలెర్ట్ చేశారు. మరి ఆ సాలిడ్ అప్డేట్ ను ఇప్పుడు రివీల్ చేశారు. రోకటిలో దంచుతున్న ఒక మాస్ పోస్టర్ ను విడుదల చేసి ఈ డిసెంబర్ 25కి ఫోకస్ షిఫ్ట్ చేశామని చెప్తున్నారు. అంటే క్రిస్మస్ గిఫ్ట్ గా “టక్ జగదీష్” నుంచి నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


