సూర్యతో పాటు నాని సినిమా కూడా హిందీ రిలీజ్.!

Published on Mar 31, 2021 3:04 pm IST

గత ఏడాది లాక్ డౌన్ మూలాన అనేక సినిమాలు డైరెక్ట్ ఓటిటిలో కూడా విడుదల కాబడిన సంగతి తెలిసిందే. మరి అలాగే వాటిలో పలువురు స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా అపర్ణ బాలమురళి హీరోయిన్ గా సీదా కొంగర దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “ఆకాశం నీ హద్దురా” ప్రైమ్ వీడియోలో విడుదలై భారీ హిట్ అయ్యింది.

అయితే దీనికి ముందు పెద్ద సినిమా ఏదన్నా ఉంది మోస్ట్ అవైటెడ్ గా నిలిచింది మాత్రం నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన బెంచ్ మార్క్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “వి” కూడా ఒకటి. మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు ఒక సూపర్ కాప్ లో నటించాడు. మొదటి నుంచి భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రైమ్ వీడియో లో అప్పుడు సాలిడ్ వ్యూవర్ షిప్స్ కూడా రాబట్టింది.

అయితే ఈ చిత్రం కూడా సూర్య ఆకాశం నీ హద్దురా లానే దక్షిణాది అన్ని కీలక భాషల్లో విడుదలయింది. మరి ఇప్పుడు ప్రైమ్ వీడియో వారు సూర్య సినిమాతో పాటుగా “వి” సినిమాను కూడా హిందీలో వచ్చే ఏప్రిల్ 4 న డిజిటల్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తెలుగులో మంచి అంచనాలతో వచ్చింది కానీ సరైన టాక్ రాలేదు అయినా అప్పట్లో అత్యధిక వ్యూవర్ షిప్స్ రాబట్టిన జాబితాలో వి కూడా నిలిచింది. సో హిందీలో కూడా మంచి ఆదరణ ఈ చిత్రానికి దక్కే అవకాశం లేకపోలేదు.

సంబంధిత సమాచారం :