ఆ మూవీల కంటే ‘భలే భలే మగాడివోయ్’లోనే ఎక్కువట.!

ఆ మూవీల కంటే ‘భలే భలే మగాడివోయ్’లోనే ఎక్కువట.!

Published on Aug 10, 2015 8:42 PM IST

Bhale-Bhale-Magadivoi
ఇప్పుడున్న యంగ్ హీరోస్ మన ఇంట్లో కుర్రాడిలా అనిపించే హీరో నాని. ‘అష్టా చమ్మా’, ‘అలా మొదలైంది’, ‘పిల్ల జమిందార్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాని ఈ ఏడాది ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండా పై కపిరాజు’ సినిమాలతో కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నాడు. ఆ జోష్ లో చేసిన తన నెక్స్ట్ మూవీ ‘భలే భలే మగాడివోయ్’. లో బడ్జెట్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టారు.

అందులో భాగంగానే ఈ రోజు నాని, మారుతి కలిసి ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ని రేడియో మిర్చిలో లాంచ్ చేసారు. ఈ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు నాని రేడియో శ్రోతలతో మాట్లాడుతూ ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని తెలిపాడు. ‘నా గత సినిమాలైన అష్టా చమ్మా, అలా మొదలైంది, పిల్ల జమిందార్ సినిమాలకంటే భలే భలే మగాడివోయ్ లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, థియేటర్స్ లో ఆడియన్స్ బాగా నవ్వుకునే సినిమా’ అని నాని తెలిపాడు. గోపి సుందర్ అందించిన ఆడియోని ఆగష్టు 15న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. నాని సరసన ‘అందాల రాక్షసి’ అనిపించుకున్న లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తోంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ – యువి క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి చేసిన నాని ప్రస్తుతం హను రాఘవాపూడి డైరెక్షన్ లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు