లయన్ లా ఉన్నావు నాన్న…నాని తో ఆడుతూ!

లయన్ లా ఉన్నావు నాన్న…నాని తో ఆడుతూ!

Published on Dec 20, 2021 1:00 PM IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. డిసెంబర్ 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, సాయి పల్లవి లు లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ హీరో నాని సోషల్ మీడియా వేదిక గా ఒక వీడియో ను షేర్ చేయడం జరిగింది. తన కొడుకు నాని ను లయన్ లా ఉన్నావు అంటూ ఆ వీడియో లో తెలిపారు. నాని శ్యామ్ సింగరాయ్ చిత్రం లో రెండు గెటప్స్ లో కనిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా లో నాని మీస కట్టు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు