యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న నాని వి టీజర్

Published on Feb 19, 2020 11:02 am IST

మొదటి నుండి నాని దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వి చిత్రంలో నాని నెగెటివ్ షేడ్స్ ఉండే కిల్లర్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరగడంతో మరింత ఆసక్తి రేగింది. ఇక రెండు రోజుల క్రితం విడుదలైన వి మూవీ టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగడంతో పాటు, 5 మిలియన్ వ్యూస్ వైపు దూసుకుపోతుంది. ఇక ఈ టీజర్ కి 2 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. టీజర్ లో నాని లుక్ మరియు డైలాగ్ డెలివరీ, ఆట్టిట్యూడ్ డిఫరెంట్ గా ఆసక్తిరేపుతున్నాయి.

ఇక వి మూవీలో మరో హీరో సుధీర్ కిల్లర్ నానిని వెంటాడే పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. వి మూవీ ఉగాది కానుకగా వచ్చే నెల 25న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :