విడుదల తేదీని ఖరారు చేసుకున్న ‘జెర్సీ’ !

Published on Mar 11, 2019 6:24 pm IST

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న ‘జెర్సీ’ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది.
ఈ మధ్యనే విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అధ్బుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ: జెర్సీ చిత్రం నాకు సినిమాగానే కాకుండా నా హృదయానికి బాగా నచ్చిన, దగ్గరైన కథ. రేపు మీ అందరి హృదయాలలో కూడా చోటు సంపాదించుకుంటుంది అనుకుంటున్నాను, ఇది 36 సంవత్సరాల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్ అనే క్రికెటర్ కథ. జెర్సీ అని ఈ సినిమాకి టైటిల్ ఎందుకు పెట్టామో ఈ చిత్రం చూసిన తరువాత అందరికీ అర్థం అవుతుంది. అర్జున్ క్యారెక్టర్ లో ఒదిగిపోయి ఈ చిత్రం ఇంత సక్సెస్ ఫుల్ గా రావడానికి ముఖ్య కారణమైన నాని గారికి, అన్ని విధాలుగా సహకరించిన మా నిర్మాత నాగ వంశీ గారికి ధన్యవాదాలు.

నిర్మాత మాట్లాడుతూ: మా ‘జెర్సీ’ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్రం మా బేనర్ లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత సమాచారం :