నాని ఆ పాత్ర కోసం రోజుకు ఎన్ని గంటలు శిక్షణ తీసుకుంటున్నాడో తెలుసా !

నాని ఆ పాత్ర కోసం రోజుకు ఎన్ని గంటలు శిక్షణ తీసుకుంటున్నాడో తెలుసా !

Published on Sep 27, 2018 3:55 AM IST

Nani

‘దేవదాస్’ చిత్ర ప్రమోషన్స్ లో బిజీ గా వున్నాడు సహజ నటుడు నాని. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఈ చిత్రం తరువాత నాని ‘మళ్ళీ రావా’ చిత్ర దర్శకుడు గౌతమ్ దర్శకత్వంలోతన 23వ చిత్రం ‘జెర్సీ’ లో నటించనున్నాడు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈచిత్రం లో అర్జున్ పాత్రలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం నాని రోజుకు 3గంటలు క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈచిత్రంలోహీరోయిన్ గా నిత్య మీనన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈచిత్రం విజయదశమికి ప్రారంభం కానుంది.

తాజా వార్తలు