సరికొత్త జానర్ ను ట్రై చేస్తున్న నాని !
Published on Jun 20, 2018 2:24 pm IST

ఇన్నాళ్లు ఫ్యామిలీ ఎమోషన్స్ కలిగిన కథలు, లవ్ స్టోరీలు, కమర్షియల్ కథలు మాత్రమే చేస్తూ వచ్చిన నాని ఇకపై కొత్త తరహా సినిమాల్ని చేయాలని నిర్ణయించుకున్నట్టున్నారు. అది కూడ పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో కావడం విశేషం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తోంది.

అయితే ఈ వార్తపై నాని, దిల్ రాజుల నుండి ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్-2 షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాని సీనియర్ హీరో నాగార్జునతో ఒక మల్టీ స్టారర్ చిత్రం చేస్తూనే త్వరలో ‘జెర్సీ’ పేరుతో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామాను మొదలుపెట్టనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook