‘బిగ్ బాస్’ సీజన్ 2 హోస్టుగా కొత్త హీరో ?

17th, March 2018 - 10:58:16 AM

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన రియాలిటీ టీవీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 2 త్వరలోనే మొదలుకానుంది. త్రివిక్రమ్, రాజమౌళిల సినిమాలు చేయాల్సి ఉండటంతో ఎన్టీఆర్ ఈ సీజన్ ను హోస్టుగా వ్యవహరించే సూచనలు కనబడటం లేదు. దీంతో పలువురు ఇతర హీరోల పేర్లు వినబడినా తాజాగా యంగ్ హీరో నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

నాని పేరు ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. మరి ఈ మాటలే నిజమైతే గతంలో రేడియో జాకీగా పనిచేసిన నాని ఈ రియాలిటీ షోను ఏ స్థాయిలో రక్తికట్టిస్తాడనే అంశం ఆసక్తికరంగా మారనుంది. ఇకపోతే ప్రస్తుతం ‘కృష్ణార్జున యుద్ధం’ చివరి దశ పనుల్లో ఉన్న నాని త్వరలో నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ ను మొదలుపెట్టనున్నాడు.