పూరితో సినిమా లేదన్న నాని !

ప్రస్తుతం నడుస్తున్న ‘బిగ్ బాస్ -2’ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాని త్వరలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. బాలయ్యతో ప్రాజెక్ట్ ఆలస్యమవుతున్నందున పూరి నానితో ఒక సినిమా చేయాలనుకుంటున్నారనేది ఆ వార్తల సారాంశం.

కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నాని తేల్చి చెప్పేశారు. దీంతో ఈ రూమర్లకు ఫులుస్టాప్ పడింది. ఇకపోతే నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తూనే త్వరలో గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే సినిమాను మొదలుపెట్టనున్నారు. ఇక పూరి జగన్నాథ్ విషయానికొస్తే ముందు నుండి చెబుతున్నట్టుగానే ఆయన తన కుమారుడు ఆకాష్ పూరితో రెండవ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నారు.