“టక్ జగదీష్” టీం సిద్ధమవుతున్నారట.!

Published on Jun 24, 2021 7:20 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “టక్ జగదీష్”. దర్శకుడు శివ నిర్వాణ మరియు నానీల కాంబోలో తెరకెక్కిన రెండో సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా మంచి మాస్ అండ్ క్లాస్ ఎలిమెంట్స్ కూడా బాగా ఉండడంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల పై కొన్నాళ్ల నుంచి బజ్ నడుస్తూనే ఉంది.

గత ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ మూలాన ఆగిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితులు సెట్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ నుంచి మళ్ళీ టక్ జగదీష్ హంగామా స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నారట. అలా స్టార్ట్ చేసి వచ్చే ఆగష్టు నాటికి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్టుగా నయా టాక్. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :