మూవీ లవర్స్ లో నాని మాటలు వైరల్.!

Published on Jul 29, 2021 7:02 am IST


నాచురల్ స్టార్ నాని హీరోగా పలు ఆసక్తికర సినిమాలు ఇప్పుడు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే మొన్ననే టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన లేటెస్ట్ చిత్రం “తిమ్మరసు” ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యి వారి చిత్ర యూనిట్ కి తన వంతు సహకారం అందించారు. అయితే ఇదే వేడుక వేదికపై నాని చేసిన పలు కామెంట్లు నెటిజన్స్ కి ముఖ్యంగా సిసలైన మూవీ లవర్స్ కి బాగా నచ్చాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో టికెట్ రేట్ ఇష్యు పై కాస్త గరంగరంగానే ఉంది.

అయినప్పటికీ కూడా చాలా మంది హీరోలు మౌనం గానే ఉన్నారు. కానీ నాని చేసిన కామెంట్స్ తో మాత్రం మూవీ లవర్స్ పర్ఫెక్ట్ గా ఏకీభవిస్తున్నారు. బయట మనం రోజూ వాడుకునే నిత్యావసర సరుకులు పప్పు, నూనె ధరలు పెట్రోలు రేట్ లు పెరిగిపోతున్నప్పుడు వాటిని తగ్గించాలి కానీ టికెట్ రేట్స్ పై ఏంటని తన మనసులో మాట ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీనితో నాని గట్స్ కి హ్యాట్సాప్ అంటూ పలువురు మూవీ లవర్స్ సోషల్ మీడియాలో నాని మాటలకు ఏకీభవిస్తున్నారు..

సంబంధిత సమాచారం :