లేటెస్ట్ : అక్కడ 1 మిలియన్ డాలర్ క్లబ్ లో నాని ‘దసరా’

Published on Apr 1, 2023 12:10 am IST


నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ ల దసరా మూవీ నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన దసరా, రిలీజ్ తరువాత ఆ అంచనాలు మించేలా సూపర్ టాక్ తో అలానే కలెక్షన్స్ తో దూసుకెళ్తుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఇక ఈమూవీ కి దాదాపుగా అన్ని ఏరియాల నుండి గ్రాండ్ గా ఓపెనింగ్స్ లభించిన విషయం తెలిసిందే. అయితే మ్యాటర్ ఏమిటంటే, నేటితో దసరా మూవీ యుఎస్ఏ లో ఏకంగా 1 మిలియన్ డాలర్ కలెక్షన్ ని సొంతం చేసుకుని గ్రాండ్ గా కొనసాగుతోంది. ఇక కేవలం ప్రీమియర్స్ తోనే ఈ మూవీ 600కె డాలర్స్ కొల్లగొట్టగా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ మూవీ మొత్తంగా 2 మిలియన్ డాలర్స్ అందుకునే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. కాగా గతంలో మారుతీ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన భలే భలే మగాడివోయ్ మూవీ యుఎస్ఏ లో 1.4 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టి నాని కెరీర్ లో ఇప్పటివరకు హైయెస్ట్ గా నిలిచింది. మరి దసరా మూవీ దానిని ఎంత స్పీడ్ గా బీట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :