నాని సినిమా ఓవర్సీస్ రైట్స్ ఎంత పలికాయంటే..!

nani-majnu
నాని హీరోగా నటించిన ‘మజ్ను’, ఈ శుక్రవారం భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి మొదలుకొని ఏడాదిన్నరలో నాలుగు హిట్స్ కొట్టిన నాని, ‘మజ్ను’తో తన హిట్ పరంపరను కొనసాగిస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉయ్యాల జంపాల సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదట్నుంచీ ఉన్న అంచనాల దృష్ట్యా సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా నాని టార్గెట్ ఆడియన్స్ ఎక్కువ ఉండే ఏరియాల్లో సూపర్ బిజినెస్ జరిగింది.

యూఎస్ బాక్సాఫీస్ వద్ద వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న నాని, ఈ సినిమాతోనూ అది రిపీట్ చేస్తాడన్న టాక్ వినిపిస్తూ ఉండడంతో యూఎస్ సహా ఓవర్సీస్ హక్కులను సుమారు 2.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారట. నాని సినిమా రేంజ్ పెరిగిందన్నది ఈ ధర మరోసారి స్పష్టం చేస్తోంది. నాని సరసన అనూ ఎమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ నిర్మించింది.