నాని 24 కి టైటిల్ సమస్య తప్పేలా లేదుగా !

Published on Mar 9, 2019 9:45 am IST

నాని – విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతు న్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. ఇటీవలే ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ స్టార్ట్ ఆయ్యింది. ఇక ఈ చిత్రానికి టైటిల్ సమస్య తప్పేలా కనిపిచడం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ టైటిల్ ను ఈ సినిమా కు వాడుతుండడం తో ఇప్పటికే మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ తో మాణిక్యం మూవీస్ అనే నిర్మాణ సంస్థ కొత్త వారితో ఒక చిత్రాన్ని నిర్మిస్తుంది. దాంతో ఈ టైటిల్ వివాదం ఆగేలా కనిపించడం లేదు. మరి మైత్రి మూవీస్ మేకర్స్ ఈ టైటిల్ సమస్యను ఎలా అధిగమిస్తుందో చూడాలి.

ఇక ఇటీవల యువ హీరో నిఖిల్ కూడా ఇలాంటి సమస్యే నే ఎదురుకున్నాడు. తన నటిస్తున్న కొత్త చిత్రానికి ముద్ర అనే టైటిల్ ను ఖరారు చేశారు. కానీ అదే టైటిల్ తో నట్టికుమార్ ఒక చిత్రాన్ని నిర్మించడం ఇటీవల ఆ టైటిల్ ఫై వివాదం కావడంతో నిఖిల్ సినిమాకు టైటిల్ మార్చారు.

సంబంధిత సమాచారం :