సంక్రాంతి సీజన్‌కు నాని కొత్త సినిమా!

సంక్రాంతి సీజన్‌కు నాని కొత్త సినిమా!

Published on Nov 8, 2015 11:54 AM IST

nani2
‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో ఊహించని స్థాయి హిట్ కొట్టి ఒక్కసారే స్టార్ స్టేటస్‌ని కొట్టేసిన హీరో నాని. తన సహజమైన నటన, మంచి టైమింగ్ ఉన్న డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ యువహీరో ప్రస్తుతం భలే భలే మగాడివోయ్ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరి సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అందాల రాక్షసి సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఓ మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అరకు ప్రాంతంలో జరుగుతోంది. ఇక ఈ సినిమాను డిసెంబర్ నెలాఖర్లో కానీ, సంక్రాంతి కానుకగా జనవరి నెలలో కానీ విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. భలే భలే మగాడివోయ్ తర్వాత నాని చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై సాధారణంగానే మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా ఇప్పటికే పూర్తైంది. ఇక ఈ వారమే ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసే ఆలోచన సినిమా యూనిట్ ఉంది. నాని ఈ సినిమాలో బాలకృష్ణ అభిమాని పాత్రలో కనిపించడం విశేషంగా చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు