యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. సూపర్ క్లాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రానున్న ఈ సినిమాలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర టీం ఈ సినిమాని సంక్ర్నతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేసేస్తున్నాం అని అనౌన్స్ చేసేయ్యడంతో ఈ చిత్ర టీం చాలా ఫాస్ట్ గా అన్ని పనులను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ స్పెయిన్ లో జరుగుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ ఈ చిత్ర టీం స్పెయిన్ మీడియాని ఆకర్షించింది.
స్పెయిన్ లోని ఓ స్పెషల్ టీవీ ఛానల్ వారు ప్రత్యేకంగా నాన్నకు ప్రేమతో సెట్స్ ని విజిట్ చేసి అక్కడ సెట్లో అందరితో మాట్లాడి నాన్నకు ప్రేమతో సినిమా గురించి తెలుసుకున్నారు. ఆ మీడియా వారికి ఎన్.టి.ఆర్, సుకుమా , రకుల్ ప్రీత్ సింగ్ లు కూడా రెస్పాండ్ అవ్వడమే కాకుండా సినిమా గురించిన విషయాలను పంచుకున్నారు. ఇంటర్నేషనల్ మీడియాలో నాన్నకు ప్రేమతో నిన్నటి హాల్ చల్ చేస్తోంది. సుకుమార్ అనుకున్న టైంకి సినిమాని పూర్తి చేసి రిలీజ్ చెయ్యడానికి ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దాదాపు డిసెంబర్ 20వరకూ జరగనున్న ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.


