యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ నిన్నటి నుంచి థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటించగా, మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో మాయ చేసే దర్శకుడు సుకుమార్ రూపొందించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న రిలీజ్ అయ్యి మల్టీ ప్లెక్సుల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా, మిగతా సెంటర్స్ లో మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని అన్ని ఏరియాల్లో బెనిఫిట్ షోలు పడ్డాయి. అలాగే మొదటి రోజు ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ కావడం వలన ఈ సినిమాకి సూపర్బ్ ఓపెనింగ్స్ వచ్చాయి.
ప్రతి ఏరియా నుంచి రికార్డ్ స్థాయిలోనే మొదటి రోజు ఓపెనింగ్స్ రాబట్టుకుంది నాన్నకు ప్రేమతో. ముఖ్యంగా నైజాంలో ఎన్.టి.ఆర్ గత రికార్డ్ ని బ్రేక్ చేసింది. నాన్నకు ప్రేమతో మొదటి రోజు నైజాంలో 4.17 కోట్ల షేర్ సాధించింది. సుకుమార్ మార్క్ స్క్రీన్‌ప్లేకు, క్లాస్ మేకింగ్‌కు, ఎన్టీఆర్ యాక్టింగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ డిఫరెంట్ సినిమాగా నాన్నకు ప్రేమతో పేరు తెచ్చుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు.


