నవంబర్ 1నుంచి స్పెయిన్ లో ఎన్.టి.ఆర్ సందడి

నవంబర్ 1నుంచి స్పెయిన్ లో ఎన్.టి.ఆర్ సందడి

Published on Oct 23, 2015 2:23 PM IST

nanaki-prematho-1

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. సూపర్ క్లాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రానున్న ఈ సినిమాలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. దసరా కానుకగా రిలీజ్ చేసిన టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడమే కాకుండా యు ట్యూబ్ లో సెన్సేషనల్ రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం 80 రోజుల పాటు లండన్ లో మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకొని హైదరాబాద్ వచ్చారు. అలాగే తదుపరి షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్ళాలని ఇది వరకే తెలిపారు. కానీ ఎప్పుడు స్పెయిన్ వెళ్లనున్నాం అనే దానిపై మాత్రం సరైన క్లారిటీ లేదు.

తాజాగా ఈ చిత్ర టీం స్పెయిన్ షెడ్యూల్ కి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెలాఖరున ఈ చిత్ర టీం అంతా బయలు దేరి స్పెయిన్ వెళ్లనున్నారు. అలాగే నవంబర్ 1 నుంచి స్పెయిన్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెడతారు. సుమారు 30 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత మిగిలి ఉన్న చిన్న చిన్న బిట్స్ ని హైదరాబాద్ లో షూట్ చేస్తారు. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2016 జనవరి 8న రిలీజ్ కానుంది.

తాజా వార్తలు