‘సమ్మోహనం’ చిత్రం తరువాత యువ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం’నన్ను దోచుకుందువటే’. నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాబా నటేష్ కథనాయికగా నటిస్తున్నారు. హీరో సుధీర్ బాబు తన సొంత ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న ఈమొదటి చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఒక్క కట్ లేకుండా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లిన్ యు సర్టిఫికేట్ ఇచ్చింది.
ఇక ఇటీవల బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాఫ్ చేతులమీదుగా విడుదలైన ఈచిత్రం యొక్క ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకులకముందుకు రానుంది. ఇక ఈ చిత్రం తరువాత సుధీర్ బాబు పులి వాసు దర్శకత్వంలో తన 11వ చిత్రంలో నటించనున్నాడు. ఈచిత్రంలో సుధీర్ కు జోడిగా మెహ్రీన్ నటించనున్నారు.


