సమ్మోహనం చిత్రం తరువాత సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం’నన్ను దోచుకుందువటే’ నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాబా నటేష్ కథనాయికగా నటిస్తున్నారు. హీరో సుధీర్ బాబు తన సొంత ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న ఈచిత్రం వినాయకచవితి రోజు సెప్టెంబర్ 13న విడుదలకావల్సి ఉండగా వాయిదాపడి సెప్టెంబర్ 21న ప్రేక్షకులకముందుకు వస్తుంది.
ఇక వినాయక చవితి రోజు నాగ చైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’, సమంత ‘యుటర్న్’చిత్రాలు విడుదలవుతుండటంతో ‘నన్ను దోచుకుందవటే’ వారం రోజులు వెనక్కి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది.
