ఎన్టీఆర్ కు నారా లోకేష్ స్పెషల్ విషెష్.!

Published on May 20, 2021 2:00 pm IST

ఈరోజు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికీ తెలిసిందే. మరి అలాగే అభిమానులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండగా పలు సినీ తారలు సహా రాజకీయ నాయకులు కూడా తారక్ కు తమ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరి అలా తారక్ కుటుంబీకులు మరియు ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ విషెష్ చెప్పడం జరిగింది. “ఎన్టీఆర్ కి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అని తన ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయగా వారి అభిమానులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :