వరుసపెట్టి ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లు చేసుకుంటూ కెరీర్ ని తనకు నచ్చిన విధంగా మలుచుకుంటున్న నటులలో నారా రోహిత్ ఒకరు. రోహిత్ ఇటీవల నటించిన ‘రౌడీ ఫెలో’ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ నారావారబ్బాయి ప్రస్తుతం అసుర, పండగలా వచ్చాడు సినిమాలతో బిజీగా వున్నాడు.
ఈ సినిమాల ఫస్ట్ లుక్ లు ఇటీవలే విడుదలై ప్రేక్షకాధరణను పొందాయి. అసుర సస్పెన్స్ నేపధ్యంలో సాగే సినిమా అయితే మరొకటి మాస్ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలూ షూటింగ్ దశలో వున్నాయి. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది మధ్యలో విడుదలకావచ్చు.


