మరో వైవిధ్య సబ్జెక్ట్ తో నారా హీరో.?

Published on Aug 11, 2020 5:42 pm IST

ఒక్క నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా మన తెలుగులో ఫిల్మ్ లవర్స్ అందరికీ కూడా నారా రోహిత్ చేసే సినిమాలు అంటే ఆసక్తి చూపిస్తారు. నారా రోహిత్ హీరోగా ఇప్పటికి ఎన్నో చిత్రాల్లో కనిపించాడు. కానీ అతని ఒక సరైన హిట్ వచ్చిన సినిమాలు మాత్రం చాలా అంటే చాలా తక్కువే ఉన్నాయని చెప్పాలి. కేవలం నటునిగా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇస్తాడని కాకుండా అతను ఎంచుకునే సబ్జెక్టుల విషయంలో కూడా ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది.

దీనితో ఈ నారా హీరోకు మంచి పడితే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు రోహిత్ తన కెరీర్ ను మొదటి పెట్టిన “బాణం” చిత్ర దర్శకుడు దంతులూరి చైతన్యతో ఒక పీరియాడిక్ చిత్రం చేయనున్నట్టు బజ్ వినిపిస్తుంది. 1970ల కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో ఒక కీలక ఘట్టం ఆధారంగా తెరకెక్కించనున్నట్టు టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే నారా రోహిత్ కు ఈసారైనా మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి. మరి ఈ చిత్రంపై ఇంకా మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More