పీరియాడిక్ డ్రామా ప్లాన్ చేస్తోన్న హీరో !

Published on Aug 9, 2020 10:30 pm IST

‘నారా రోహిత్’ మొదటి నుండి వైవిధ్యమైన చిత్రాలనే చేస్తూ వస్తున్నాడు. అయితే అలాంటి స్క్రిప్ట్ నే ఎప్పటినుండో చేయాలని చూస్తున్నా ఎందుకో పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. ఇక ఈ సమ్మర్ లో మొదలుపెడతారు అనుకుంటే.. కరోనా వచ్చింది. అయితే కరోనా అనంతరం అయినా నారా రోహిత్ ముందుగా ఆ సినిమానే మొదలుపెడతాడట. బాణం చిత్రం దర్శకుడు చెైతన్య దంతులూరి దర్శకత్వంలో 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ చిత్రమే నారా రోహిత్ ఎప్పటి నుండో చేయాలనుకుంటున్నాడు.

కరోనా తగ్గాక ఈ చిత్రం పట్టాలెక్కనుందని తెలుస్తోంది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమా చేస్తున్నారట. దర్శకుడిగా చెైతన్య దంతులూరి తన మొదటి చిత్రమైన ‘బాణం’ చిత్రంతోనే చెైతన్య మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత బసంతి చిత్రంతోనూ తాను టాలెంటెడ్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నే ప్రయత్నం చేశాడు. అయినా చెైతన్య దంతులూరి కమర్షల్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమా చేస్తున్నాడట.

సంబంధిత సమాచారం :

More