వెంకీ సినిమాలో నారా రోహిత్ కీ రోల్ !

విక్టరీ వెంకటేష్ ఈ మధ్యే తేజ డైరెక్షన్లో ఒక సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ థ్రిల్లర్ గా ఉండబోతున్న ఈ చిత్రంలో వెంకటేష్ ప్రొఫెసర్ పాత్రలో నటించనుండగా యంగ్ హీరో నారా రోహిత్ కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించనున్నారు. వెంకీ, రోహిత్ ఇద్దరూ బావ, బామ్మర్దులుగా కనిపిస్తారని టాక్ వినిపిస్తుండగా ఇంకా స్పష్టమైన క్లారిటీ అందాల్సి ఉంది.

ఇకపోతే అతిథి రావ్ హైదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాను దర్శకుడు తేజ ఎన్టీఆర్ బయోపిక్ తో పాటే తీస్తారా లేకపోతే అది పూర్తయ్యాక దీన్నీ మొదలుపెడతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. రెగ్యులర్ కథల్ని దూరం పెట్టి భిన్నత్వం ఉన్న స్క్రిప్ట్స్ ను మాత్రమే ఒప్పుకుంటున్న వెంకటేష్ చేస్తున్న చిత్రం కావడంతో ఇందులో ఎలాంటి కొత్తదనం ఉంటుందో చూడాలని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.