యంగ్ హీరో పీరియాడిక్ చిత్రం మొదలవ్వబోతుంది !

Published on Oct 2, 2018 8:42 am IST

వైవిధ్యమైన చిత్రాల కథానాయకుడు ‘నారా రోహిత్’ బాణం చిత్రం దర్శకుడు చెైతన్య దంతులూరి దర్శకత్వంలో 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమా చేస్తున్నారు.

కాగా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని, నారా రోహిత్ కెరీర్ లోనే ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలిచిపోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మిగిలిన నటీనటులను కూడా ప్యాడింగ్ నే తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ఈ చిత్రానికి డిజైన్స్ కూడా పూర్తి చేశారు.

సంబంధిత సమాచారం :