తమిళ సూపర్ హిట్ రీమేక్లో నారా రోహిత్.!

తమిళ సూపర్ హిట్ రీమేక్లో నారా రోహిత్.!

Published on Apr 30, 2015 11:37 AM IST

nara-rohith

సినీ పరిశ్రమలో ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం చాలా కామన్ గా జరిగే విషయమే.. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాని తెలుగులోకి తీసుకు రావడానికి రంగం సిద్దం చేసారు. తమిళంలో ప్రస్తుతం వరుస హిట్స్ అందుకుంటున్న యంగ్ హీరో శివ కార్తికేయన్ – హన్సిక జంటగా నటించిన ‘మాన్ కరాటే’ సినిమా 2014లో తమిళంలో విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఇదే సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారు.

ఈ సినిమా తెలుగు రీమేక్ కోసం నారా వారబ్బాయి నారా రోహిత్ ని హీరోగా ఫైనలైజ్ చేసారు. అలాగే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం జిల్ సినిమాలో కనిపించి మెప్పించిన కబీర్ ని ఫైనలైజ్ చేసారని సమాచారం. ప్రస్తుతం నిర్మాతలు హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. హీరోయిన్ ఫైనలైజ్ అవ్వగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు. ‘గుండెల్లో గోదారి’, ‘జోరు’ సినిమాల దర్శకుడు కుమార్ నాగేంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కి పూర్తిగా కామెడీని మిక్స్ చేసి తీసిన ఈ సినిమాకి టాప్ డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్ కథని అందించాడు. ఈ మూవీ తెలుగు రీమేక్ పై త్వరలోనే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తారు.

తాజా వార్తలు