టాలీవుడ్ నటుడు నారా రోహిత్, ఆయన సతీమణి సిరి లీళ్ల తమ పండంటి మగబిడ్డను సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి పరిచయం చేశారు. జూన్ నెలలో జన్మించిన తమ బాబు మొదటి ఫొటోను అభిమానులతో పంచుకుంటూ, అతనికి ‘నందన్ రామ నారా’ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సిరి లీళ్ల బాబును ఎత్తుకోగా, రోహిత్ పక్కనే చిరునవ్వులు చిందిస్తున్న ఒక అందమైన ఫ్యామిలీ పిక్‌ను పంచుకున్నారు. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది. అంతేకాకుండా, తమ కుమారుడి పేరు వెనుక ఉన్న ప్రత్యేకతను కూడా ఈ దంపతులు వివరించారు. ‘నందన్’ అంటే అపారమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేవాడని అర్థం కాగా, ‘రామ’ అనే పేరును బాబు తాతగారి జ్ఞాపకార్థం గౌరవసూచకంగా జోడించినట్లు తెలిపారు.
ఈ చిన్నారి తమ జీవితంలోకి వచ్చిన అత్యంత గొప్ప ఆశీర్వాదమని నారా రోహిత్ జంట ఒక ఎమోషనల్ మెసేజ్‌ను పంచుకోగా, ఈ కొత్త చాప్టర్ ప్రారంభించిన నారా దంపతులకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
With hearts full of love, gratitude, and joy,
we are delighted to introduce our son to the world asNANDHAN RAMA NARA 🤍
Nandhan: One who brings boundless joy and happiness.
Rama: A cherished name carried forward with love, in honour of his grandfather.
Welcome to the world,… pic.twitter.com/BC1eFUC9D3
— Rohith Nara (@IamRohithNara) September 21, 2026


