ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పరుచూరి మురళి దర్శకత్వంలో నారా రోహిత్, జగపతిబాబు నటిస్తోన్న సినిమా ‘ఆటగాళ్ళు’. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జయ్ సి కుమార్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్, జగపతిబాబులు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు.
విభిన్నమైన ప్రయోగంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించారు దర్శకుడు పరుచూరి మురళి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. నారా రోహిత్ ప్రస్తుతం ‘శబ్దం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మంజునాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
