నారా రోహిత్ నటించిన తాజా చిత్రం రౌడీ ఫెల్లో ఇటీవలే నిర్మాణాంతర కార్యక్రమాలు ముగించుకుని శుక్రవారం విడుదలకానుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ‘యు/ఏ’ సర్టిఫికేట్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో నారా రోహిత్ నటన ప్రధాన ఆకర్షణ అని తెలుస్తుంది. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో అబ్బురపరిచే డైలాగులతో ఈ సినిమా సాగనుందని సమాచారం
ట్రైలర్ లు, ఆడియోకి మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. విశాఖ సింగ్ హీరోయిన్. రావు రమేష్, పోసాని ప్రముఖ పాత్రలు పోషించారు.స్వామి రారా ఫేం సన్నీ సంగీతాన్ని అందించారు


