డైరెక్ట్ ఓటిటి గా నారప్ప…జూలై 20 న ప్రైమ్ వీడియో లో!

Published on Jul 12, 2021 4:13 pm IST

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రం తమిళ నాట సూపర్ హిట్ అయిన అసురన్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ విడియో ద్వారా డైరెక్ట్ గా విడుదల కానుంది. ఈ చిత్రం కి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ప్రైమ్ విడియో లోనే విడుదల అవుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. అంతేకాక విడుదల తేదీ ను ప్రకటిస్తూ తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ నెల 20 వ తేదీన నారప్ప చిత్రం డైరెక్ట్ ఓటిటి గా విడుదల కానుంది. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కానుండటంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ నారప్ప చిత్రం లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా ప్రియమణి నటిస్తుంది.

సంబంధిత సమాచారం :